సర్పంచ్ అను నేను..
● ఈనెల 22న సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం
రాయికల్: ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులు ఈనెల 22న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం పంచాయతీల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులు చేసే ప్రమాణం ఇలా ఉంటుంది. ‘సర్పంచ్/వార్డు సభ్యుడు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం, విధేయత కలిగి ఉండి, నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని, భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను..’ అని ప్రమాణం చేయాల్సి ఉంటుంది.
ప్రమాణ పత్రంలో ఉండే అంశాలివే...
● నేను భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవిస్తానని
● నా విధులను నిజాయితి, నిస్పక్షపాతంగా భక్తితో నిర్వహిస్తానని
● గ్రామ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని,
● గ్రామపంచాయతీ ఆస్తులు, నిధులను జాగ్రత్తగా వినియోగిస్తాను.
● గ్రామ ప్రజలకు సేవ చేయడానికి అంకితంగా ఉంటానని, దీనికి సాక్షిగా ఈ ప్రమాణపత్రంపై సంతకం చేస్తున్నా.


