ఆయిల్ పాం విస్తీర్ణం పెంచాలి
● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల: జిల్లాలో ఆయిల్ పాం సాగు విస్తీర్ణం పెరిగేలా చూడాలని, ఫిబ్రవరి వరకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం ఉద్యాన, వ్యవసాయ, సహకార తదితర శాఖలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పాంపై ఎలాంటి అపోహాలు వద్దని, గెలల కోత ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వం నిర్దేశించిన రేటుకు కొనుగోలు చేస్తారని వివరించారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఉద్యాన అధికారి శ్యామ్‌ప్రసాద్, వ్యవసాయ అధికారి భాస్కర్ పాల్గొన్నారు.


