పాఠశాల అభివృద్ధికి కృషి
● హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవి
ధర్మపురి: పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హైకోర్టు న్యాయమూర్తి జువ్వాడి శ్రీదేవి అన్నారు. మండలంలోని తిమ్మాపూర్ ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ నిర్మాణం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆట) సంస్థ ఆధ్వర్యంలో నిధులు మంజూరు కాగా ప్రహరీతోపాటు విద్యార్థులకు రక్షిత మంచినీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారు. వీటిని హైకోర్టు న్యాయమూర్తి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తదితరులు హాజరై ప్రారంభించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, ఇలాంటి కార్యక్రమంలో ప్లాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ముందుగా న్యాయమూర్తికి ప్రత్యేక ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, సర్పంచ్ నలుమాసు పుష్పలత, ఆట కార్యవర్గ సభ్యులు, నిర్వాహకులు ప్రకాశ్‌రావు, ఆట ప్రెసిడెంట్ జయంత్ చల్లా, జిల్లా విద్యాధికారి రాము, ఎంఈవో సీతామహాలక్ష్మి, నాయకులు జువ్వాడి కృష్ణారావు, ఎస్.దినేష్ తదితరులున్నారు.


