నేడు యథావిధిగా ప్రజావాణి
● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాలటౌన్: కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవా రం నుంచి యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదివారం తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలను అర్జీల రూపంలో కలెక్టరేట్‌కు వచ్చి అధికారులకు సమర్పించాలని సూచించారు.
‘వాట్సాప్’లో సాగు సమాచారం
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులు రకరకాల పంటలు సాగు చేస్తున్నప్పటికీ సరైన సలహాలు అందక దిగుబది పొందలేకపోతున్నారు. ఆదాయం రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్‌గా పనిచేసిన ఎల్.కిషన్ రెడ్డి రైతులకు సూచనలు అందించాలన్న లక్ష్యంతో వాట్సాప్‌లో సాగు సమాచారాన్ని ఉచితంగా అందిస్తున్నారు. రైతులు వ్యవసాయంలో ఎదుర్కొంటున్న సమస్యను తమ ఇంటి నుంచే 85002 23817 నంబర్‌కు మెసేజ్ పంపిస్తే.. వెంటనే తెలుగులో సరైన సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ అవకాశాన్ని నిజామాబాద్, కామారెడ్డి జిల్లా రైతులు వినియోగించుకుంటున్నారు.
ఉపాధి పథకాన్ని నీరుగార్చే కుట్ర
జగిత్యాలటౌన్: ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నీరుగార్చే కుట్ర చేస్తోందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. ఉపాధి పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ.. ఆదివారం కాంగ్రెస్ శ్రేణులు జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలిపారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వం ఉపాధి పథకాన్ని తెచ్చిందన్నారు. గాంధీ పేరును తొలగించి శ్రీరాముని పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయం సరికాదన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, పీసీసీ కార్యదర్శి బండ శంకర్, నాయకులు గాజుల రాజేందర్, దుర్గయ్య, పుప్పాల అశోక్, శోభరాణి, రాదాకిషన్, గుండా మధు ఉన్నారు.
గాయపడిన వ్యక్తికి సీపీఆర్
జగిత్యాలజోన్: జగిత్యాల కొత్త బస్టాండ్ ఆవరణలో ఓ ద్విచక్రవాహనదారుడిని ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై రవీందర్‌రావు, హోంగార్డు చంద్రశేఖర్ గాయపడిన వ్యక్తికి సీపీఆర్ చేసి, మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
24న గల్ఫ్ వలసలపై అవగాహన సదస్సు
మల్లాపూర్: స్థానిక రైతువేదికలో ఈనెల 24న గల్ఫ్ వలసలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ప్రవాసీ మిత్ర లేబర్ యూని యన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల, కార్యదర్శి సాయిండ్ల రాజరెడ్డి, కొశాధికారి నల్లాల జైపాల్, దామోదర్ తెలిపారు. గల్ఫ్ వెళ్లే ముందు మోసపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విదేశాల్లో పనిచేసే సమయంలో ఎదురయ్యే పరిస్థితులు, అక్కడి చట్టాలు, సంస్కృతి, భద్రతా నిబంధనలు, వేతన ఒప్పంద వివరాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. వివిధ దేశాల్లో పనిచేసి.. స్వగ్రామాలకు వచ్చిన వారు తమ అనుభవాలను గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలని కోరారు. సదస్సులో కొత్తగా ఎంపికై న సర్పంచ్‌లు, ఉపసర్పంచ్, వార్డుసభ్యులు గల్ఫ్ వలస నేపథ్యం కలిగిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొనాలని కోరారు.
నేడు యథావిధిగా ప్రజావాణి
నేడు యథావిధిగా ప్రజావాణి
నేడు యథావిధిగా ప్రజావాణి


