గురుకులం విద్యార్థులు.. ఆటల్లో మెరికలు
మల్యాల: మల్యాల మండలం తాటిపల్లి బాలికల గురుకుల పాఠశాల 2018లో ఇంటర్మీడియేట్ కళాశాలగా అప్‌గ్రేడ్ అయింది. అప్పటినుంచి అటు పదో తరగతిలో.. ఇటు ఇంటర్‌లోనూ వందశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. చదువుతోపాటు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, యోగా, కరాటేలో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి ఆటల్లో రాణిస్తూ సత్తా చాటుతున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ మానస నిత్యం పర్యవేక్షిస్తూ చదువులో సబ్జెక్టుల వారీగా వెనకబడిన విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ.. విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తూ.. విద్యార్థుల్లో మానసిక స్థైర్యం పెంపొందిస్తూ.. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులు నిత్యం కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్‌లో రాణించేందుకు పీఈఓ మధులిక ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేస్తుండడంతో ఏటా జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణిస్తున్నారు.
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణింపు
రాష్ట్రస్థాయిలో సత్తాచాటుతున్న వైనం
గురుకులం విద్యార్థులు.. ఆటల్లో మెరికలు


