కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
ధర్మపురి: నేరెళ్ల బస్టాండ్ సమీపంలో కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని నేరెళ్లకు చెందిన వేముల శివమణి ఆదివారం ద్విచక్రవాహనంపై జగిత్యాల వెళ్లాడు. పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా నేరెళ్ల బస్టాండ్ వద్ద వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో శివమణి తలకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న జాజాల రమేశ్ వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి.. అక్కడినుంచి కరీంనగర్ తరలించారు.
కొండగట్టుకు త్వరలో పవన్ కల్యాణ్?
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో తిరుమల తి రుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 96 గదుల సత్రం నిర్మించేందుకు రూ. 35.19కోట్లు మంజూరైన నేపథ్యంలో ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ము ఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్వరలో రానున్నట్లు తెలిసింది. జనవరి 3న కొండగట్టుకు రానున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అధికారికంగా కార్యక్రమం ఖరారు కాలేదని అధికారులు తెలిపారు.
కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు


