భారీ పేలుళ్లతో భయం
మోతె, తిమ్మాపూర్ గ్రామాల మధ్య గ్రానైట్ వ్యాపారి నిత్యం సాయంత్రం వేళల్లో భారీగా బ్లాస్టింగ్‌లు పెడుతుండటంతో తీవ్ర భయాందోళన చెందుతున్నాం. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు సాయంత్రం వేళల్లో బ్లాస్టింగ్‌లకు భయపడి ముందుగానే ఇంటికి చేరుతున్నారు. – చిర్రం భగవంతం, వార్డు మెంబర్, మోతె
తిమ్మాపూర్ శివారులోని నల్లగుట్టకు గ్రానైట్ వ్యాపారి ఇష్టారాజ్యంగా గ్రానైట్ తీస్తూ భారీ ట్రక్కుల్లో పరిమితికి మించి ఓవర్‌లోడ్ పంపిస్తుండడంతో రోడ్లన్నీ ధ్వంసమై భారీగా గుంతలు ఏర్పడుతున్నాయి. తారురోడ్లు కూడా ధ్వంసం అవుతున్నాయి.
– దుబ్బాక రమేశ్, వార్డు మెంబర్, తిమ్మాపూర్
జగిత్యాల అర్బన్ మండలం మోతె శివారులోని నల్లగుట్టకు గ్రానైట్ తీసే వ్యాపారికి అనుమతులున్నాయి. రోడ్ల ధ్వంసంపై వ్యాపారికి సమాచారం ఇచ్చి మరమ్మతు చేయిస్తాం. రైతులకు ఇబ్బంది లేకుండా చూసేలా చర్యలు చేపడతాం.
– జైసింగ్, జిల్లా మైనింగ్ అధికారి
భారీ పేలుళ్లతో భయం


