మారుమోగిన అయ్యప్ప నామ స్మరణం
కోరుట్లరూరల్: గురుస్వాముల భజనలు.. కన్నెస్వాముల శరణు ఘోషతో కోరుట్ల మండలంలోని నాగులపేట నాగులమ్మ ఆలయం మారుమోగింది. ఆలయం ఆవరణలో అయ్యప్ప పడిపూజను గురువారం వైభవంగా నిర్వహించారు. గూడెం గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, గురుస్వాములు చిద్రాల నారాయణ, అంబటి శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, భూమయ్య, తాజా సర్పంచులు కేతిరెడ్డి గంగజల, చీటి స్వరూపారాణి, ఎంపీడీఓ రామకృష్ణ, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
మారుమోగిన అయ్యప్ప నామ స్మరణం


