హామీలను మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం
జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కనీస అభివృద్ధి జరగడం లేదని, హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని, విజయోత్సవాలు ఎవరి కోసం చేస్తున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు. కోరుట్ల, మెట్‌పల్లి ఆస్పత్రుల్లో మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని, ప్రజలు అసిహ్యించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ హయాంలో జగిత్యాల అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. ధర్మపురిలో వ్యవసాయ కళాశాల మంజూరుతో పా టు, 40 ఎకరాల భూమి కేటాయిస్తే తక్కువ అడ్మిషన్లు ఉన్నాయని దానిని జగిత్యాలకు తరలించారన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ, వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్ పాలన అధ్వానంగా ఉందన్నారు. విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారో చె ప్పాలని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మీ, తులం బంగా రం ఇచ్చినందుకా అని హేళన చేశారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా ఇంటిగ్రేటెడ్ మా ర్కెట్, యావర్‌రోడ్ కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. మాజీమంత్రి గొడిశెల రాజేశంగౌడ్, ఎ ల్లాల శ్రీకాంత్‌రెడ్డి, లోక బాపురెడ్డి, దేవేందర్‌నా యక్, శీలం ప్రవీణ్, వొల్లం మల్లేశం పాల్గొన్నారు.


