జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలి
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీలో సేవాదళ్ విభాగం కీలకమని, ఇందులో యువతను చేర్పించేందుకు కృషి చేయాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కోరారు. టీపీసీసీ సేవాదళ్ సెక్రెటరీ బాగోజి ముఖేశ్‌ఖన్నా ఆధ్వర్యంలో చేపట్టిన ఆన్‌లైన్ మెంబర్‌షిప్ కార్యక్రమాన్ని పట్టణంలోని ఇందిరాభవన్‌లో శనివారం డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్యతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని కోరారు. పార్టీని నమ్ముకుని పని చేసే కార్యకర్తలు, నాయకులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, కల్లెపెల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, సలీం, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
మహాభారత ప్రవచనంలో మాజీమంత్రి
జగిత్యాలరూరల్: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ శివారులోని రెడ్డి కల్యాణ మండపంలో శృంగేరి పీఠ ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్‌శాసీ్త్ర నిర్వహిస్తున్న మహాభారత ప్రవచన మహాయజ్ఞంలో మాజీమంత్రి జీవన్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.


