ఎన్నికల విధులకు డుమ్మా.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధులకు డుమ్మా.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్‌

Dec 14 2025 8:40 AM | Updated on Dec 14 2025 8:40 AM

ఎన్ని

ఎన్నికల విధులకు డుమ్మా.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్‌

జగిత్యాల: పంచాయతీ ఎన్నికల్లో విధులకు హాజరుకానందున ముగ్గురిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి విడత సర్పంచ్‌ ఎన్నికల్లో 89 మంది అధికారులు విధులకు హాజరు కాకపోవడంతో షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ముగ్గురు ప్రిసైడింగ్‌ అధికారులు హేమ, రాధ, రఘుపతిరావును సస్పెండ్‌ చేశారు.

ప్రశాంతంగా నవోదయ పరీక్ష

జగిత్యాల/ధర్మ పురి: జిల్లాలో శని వారం జవహర్‌లా ల్‌ నవోదయ ప్రవే శ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని శ్రీనిధి, గౌతమి, చైతన్య, పురాతన పాఠశాల, ధర్మపురిలోని బాలికల ఉన్నత పాఠశాలలో సెంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో సెంటర్లను అదనపు కలెక్టర్‌ లత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె వెంట డీఈవో రాము, అర్బన్‌ తహసీల్దార్‌ రామ్మోహన్‌ ఉన్నా రు. ధర్మపురిలో చీఫ్‌ సూపరింటెండెంట్‌ శంకర య్య, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంఈవో సీతామహాలక్ష్మి తదితరులు కేంద్రాన్ని పర్యవేక్షించారు.

సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక దృష్టి

రాయికల్‌(జగిత్యాల): గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని మెట్‌పల్లి డీఎస్పీ రాములు అన్నారు. శనివారం రాయికల్‌లో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించామని, ఎవరైనా ఎన్నికల్లో గొడవలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్సై సుధీర్‌రావు ఉన్నారు.

డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం సందర్శన

జగిత్యాలరూరల్‌: పంచాయతీ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలని జెడ్పీ డెప్యూటీ సీఈవో నరేశ్‌ అన్నారు. శనివారం జగిత్యాల అర్బన్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రతి గ్రామంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. రూరల్‌ సీఐ సుధాకర్‌, తహసీల్దార్‌ రామ్మోహన్‌, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో వాసవి పాల్గొన్నారు.

వయోవృద్ధులకు ఆసరా టాస్కా

జగిత్యాల: వయోవృద్ధులకు తెలంగాణ ఆల్‌ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ ఆసరాగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్‌ అన్నారు. 9వ టాస్కా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం భవనంలో వేడుకలు నిర్వహించారు. వయోవృద్ధులను నిరాదరిస్తే మూడు నెలల జైలుశిక్ష, జరిమానా ఉంటుందన్నారు. అనంతరం సీనియర్‌ సిటిజన్స్‌ను సత్కరించారు. విశ్వనాథం, ప్రకాశ్‌రావు, హన్మంతరెడ్డి, దేశాయి, బొల్లం విజయ్‌ పాల్గొన్నారు.

15న జాబ్‌మేళా

జగిత్యాల: రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈనెల 15న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాల చైర్మన్‌ రామకృష్ణ తెలిపారు. మేళాకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. జాబ్‌మేళాలో ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ టెక్‌ మహేంద్రతో పాటు, ఇతర బహుళజాతి కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. మిగతా వివరాలకు 84998 07141 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

ఎన్నికల విధులకు డుమ్మా.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్‌
1
1/3

ఎన్నికల విధులకు డుమ్మా.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్‌

ఎన్నికల విధులకు డుమ్మా.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్‌
2
2/3

ఎన్నికల విధులకు డుమ్మా.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్‌

ఎన్నికల విధులకు డుమ్మా.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్‌
3
3/3

ఎన్నికల విధులకు డుమ్మా.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement