మలి దశకు వేళాయె..
నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి జీపీలకు చేరిన సిబ్బంది ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం
జగిత్యాల/జగిత్యాలరూరల్/రాయికల్: జిల్లాలో రెండో విడత పోలింగ్ నిర్వహణకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు, ఉద్యోగులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి గ్రామాలకు తరలివెళ్లారు. ప్రతీ మండల కేంద్రంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటు చేసి పోలింగ్ సామగ్రిని ఆయా బూత్‌లకు తరలించారు. రెండో విడత జిల్లాలో మొత్తం 144 పంచాయతీలకు 10 ఏకగ్రీవం కాగా 134 సర్పంచ్ స్థానాలకు, 1,276 వార్డులకు 330 ఏకగ్రీవం కాగా, 946 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్ సిబ్బందిని సైతం అదనంగా 10 శాతం రిజర్వ్‌లో ఉంచారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కెమెరాలు ఏర్పాటు చేశారు.
భారీ బందోబస్తు
మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగగా, రెండో విడత సజావుగా నిర్వహించేందుక భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి విడత ఎన్నికల్లో పోలింగ్ సరళి నెమ్మదిగా సాగడంతో ఒంటి గంటకు ముగియాల్సిన పోలింగ్ కొన్ని గ్రామాల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగడంతో చాలా గ్రామాల్లో కౌంటింగ్ లేట్‌గా జరిగింది. ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి. అయితే అధికారులు ఈసారి తొందరగా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
రెండో విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను పరిశీలించి మాట్లాడారు. ఎన్నికల సిబ్బంది నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. సిబ్బందికి పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
సమర్థవంతంగా విధులు నిర్వహించాలి: ఆర్డీవో
ఎన్నికల అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అన్నారు. శనివారం ఎస్‌కేఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జగిత్యాల రూరల్ మండలం ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని, ప్రతీ ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాలన్నారు. డీపీవో రఘువరణ్, ఎంపీడీవో రమాదేవి, రూరల్ తహసీల్దార్ వరందన్, ఎంపీవో రవిబాబు, సూపరింటెండెంట్ గంగాధర్, డెప్యూటీ తహసీల్దార్ అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రాయికల్ మండలంలోని 30 గ్రామాల్లో ఆదివారం జరిగే ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద నుంచి సామగ్రిని పంపిణీ చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఎన్నికల అబ్జర్వర్ రమేశ్ పరిశీలించారు. ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున, ఎంపీవో సుష్మ, పంచాయతీరాజ్ ఏఈ ప్రసాద్, ఎంఈవో రాఘవులు, కమిషనర్ మనోహర్‌గౌడ్ పాల్గొన్నారు.
రెండో విడత పోలింగ్ వివరాలు..
మండలాలు 7
గ్రామపంచాయతీలు 144
వార్డులు 1,276
ఏకగ్రీవమైన జీపీలు 10
ఏకగ్రీవమైన వార్డులు 330
పోలింగ్ కేంద్రాలు 1,276
ఓటర్లు 2,12,092
పీవోలు 1,531
వోపీవోలు 2,041
మలి దశకు వేళాయె..
మలి దశకు వేళాయె..
మలి దశకు వేళాయె..
మలి దశకు వేళాయె..


