మున్నూరుకాపును డీసీసీ అధ్యక్షుడిని చేయండి
కథలాపూర్(వేములవాడ): జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని మండలంలోని మున్నూరుకాపు కులానికి చెందిన చెదలు సత్యనారాయణకు ఇవ్వాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య మంగళవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ను హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం ఇచ్చారు. డీసీసీ అధ్యక్ష పదవులు బీసీలకు 42 శాతం ఇవ్వాలని, మున్నూరుకాపు కులస్తులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. చెదలు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి పనిచేస్తూ ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్, ఉమ్మడి కరీంనగర్ డీసీసీ కార్యదర్శిగా, మండలాధ్యక్షుడిగా సేవలందించారన్నారని పేర్కొన్నారు.


