● రాగివైరును ఎత్తుకెళ్తున్న దొంగలు ● ఆందోళనకు గురవుతున్
మల్యాల: విద్యుత్ మోటార్ల దొంగతనాలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా మల్యాలలోని వివిధ గ్రామాల్లో వరుస దొంగతనాలు రైతులను కలవరపెడుతున్నాయి. రైతులు వరదకాలువ, వ్యవసాయ బావులపై ఆధారపడి పంటలు సాగు చేస్తుండగా.. మోటార్లను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్తున్నారు. వరదకాలువకు రైతులు పెట్టుకున్న మోటార్లను దొంగలు ఉదయం పూట రెక్కీ నిర్వహించి.. రాత్రివేళ ఎత్తుకెళ్తున్నారు.
రైతుల బెంబేలు
వ్యవసాయ మోటార్లలోని కాపర్‌వైర్ కోసం దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంట పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో మోటార్లు చోరీకి గురవుతుండడంతో పొలానికి సకాలంలో నీరందడం లేదని, పైగా కొత్త మోటార్లు తెచ్చుకోవాలంటే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన రైతు పోతరాజు బక్కయ్య విద్యుత్ మోటార్లను రెండుసార్లు ఎత్తుకెళ్లారు. దీంతో ఆ రైతు పొలం వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. సుమారు నెల క్రితం రాత్రివేళ ఇద్దరు వ్యక్తులు మోటారు ఎత్తుకెళ్తున్నట్లు రికార్డయ్యింది. దాని ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు రైతు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రికార్డులు పరిశీలిస్తున్నామని చెబుతున్నారే తప్ప నిందితులను గుర్తించడం లేదని అంటున్నారు పరిసర ప్రాంత రైతులు.
గతంలో ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్‌వైరు చోరీ..
గతంలో దొంగలు ఏకంగా ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్‌వైర్‌ను చోరీ చేసేవారు. ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేసి, అందులోని కాపర్ వైరు ఎత్తుకెళ్లేవారు. కానీ.. కొద్దిరోజులుగా రైతుల మోటార్లు ఎత్తుకెళ్తున్నారు. పొలానికి నీరు పెట్టేందుకు ఉదయమే పొలాలకు వెళ్లిన రైతులకు మోటార్లు లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. రెండేళ్ల క్రితం నూకపల్లి రైతులు నిఘా పెట్టి.. వ్యవసాయ మోటార్లను చోరీ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
వ్యవసాయ మోటార్లే టార్గెట్
మోటారు ఎత్తుకెళ్లడంతో ఖాళీ పైపు
సీసీ పుటేజీలో రికార్డయిన మోటారు దొంగతనం
దొంగతనాలపై దృష్టి
● రాగివైరును ఎత్తుకెళ్తున్న దొంగలు ● ఆందోళనకు గురవుతున్


