అభివృద్ధిని చూసి ఓటేయండి
జగిత్యాల: అభివృద్ధిని చూసి ఓటేయాలని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాలలో ప్రచారం చేశారు. బ్యాంక్ అభివృద్ధికి తన తండ్రి జగపతిరావు కృషి చేశారని, జగిత్యాల ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సంజయ్ మద్దతుతో కార్తీక్, కూసరి అనిల్‌కు తమ ప్యానల్‌లో అవకాశం కల్పించామని, తమ ప్యానల్‌కు గెలిపించాలని కోరారు.


