అమృత్ 2.0 .. అంతులేని జాప్యం
● రూ.19.40 కోట్లతో తాగునీటి పనులు
● నత్తనడకన సాగుతున్న వైనం
● గడువులోపు పూర్తికావడం గగనమే ● మెట్‌పల్లి మున్సిపాలిటీకి అమృత్ 2.0 కింద ప్రభుత్వం రూ.19.40 కోట్లు కేటాయించింది.
● ఈ నిధులతో పలు వార్డుల్లో 29.5కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మించాలనేది సంకల్పం.
● ఆరపేట వద్ద 9లక్షల లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మాణం..
● ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉన్న మి షన్ భగీరథ సంపు వద్ద ప్రహరీ, స్టాఫ్‌క్వార్టర్‌ల నిర్మాణం వంటి పనులను చేపట్టాల్సి ఉంది.
● పనులను గతేడాది జూన్‌లో ప్రారంభించగా.. ఇప్పటివరకు 20శాతానికి మించి పనులు జరగలేదని సమాచారం.
● ఆరపేట శివాలయం సమీపంలో రిజర్వాయర్ నిర్మాణం కోసం కొంతమేర తవ్వకం పనులు చేపట్టారు. ఆ స్థలం అనుకూలంగా లేకపోవడంతో నిలిపివేశారు.
● అలాగే పైపులైన్ నిర్మాణం కోసం పలు వార్డులకు కొన్ని నెలల క్రితం కాంట్రాక్టర్ పైపులను చేరవేశారు. వాటికి సంబంధించిన పనులను మాత్రం ఇంకా ప్రారంభించడం లేదు.
● మొత్తం పనులను వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం అవి జరుగుతున్న తీరు చూస్తే మాత్రం ఆ లోపు పూర్తి కావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
● మిషన్ భగీరథ కింద వాటర్ ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణం చేపట్టినప్పటికీ పూర్తిస్థాయిలో ఇళ్లకు నల్లాల ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదు.
● ఎండాకాలంలో పలు కాలనీల ప్రజలు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
● అమృత్ పనులు పూర్తయితే వచ్చే వేసవి నుంచైనా నీటి సమస్య తీరుతుందని ఆశీస్తున్న వారికి నిరాశే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
● ఉన్నతాధికారులు స్పందించి పనులు గడువు లోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మెట్‌పల్లి: మెట్‌పల్లి పట్టణంలో తాగునీటి అవసరాలను మెరుగుపర్చడానికి అమృత్ 2.0 కింద చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం కింద పైపులైన్లు, వాటర్ ట్యాంకులను నిర్మించినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో ఇళ్లకు నీరు అందడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నగరాలు, పట్టణాలకు పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టిన పనులు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పనుల్లో జాప్యం జరుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రూ.19.40కోట్లు మంజూరు
ఏడాది క్రితం ప్రారంభం..
అమృత్ పనులను పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పనుల్లో జాప్యంపై సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీకి వారు నోటీసులు ఇచ్చారు. గడువులోపు పనులను పూర్తి చేయాలని సూచించారు.
– నాగేశ్వర్‌రావు,
మున్సిపల్ డీఈఈ
నోటీసులు ఇచ్చాం
1/1
అమృత్ 2.0 .. అంతులేని జాప్యం