పాడిపశువులకు టీకాలు వేయించాలి
కొడిమ్యాల: పాడి పశువులకు రైతులు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ ప్రకాశ్ తెలిపారు. మండలంలోని కోనాపూర్‌లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని బుధవారం సందర్శించారు. పాడి రైతులతో మాట్లాడుతూ గాలికుంటు నివారణ టీకాల ద్వారా పశువులకు వ్యాధుల నుంచి రక్షణ లభించడమే కాకుండా పాల ఉత్పత్తి మెరుగవుతుందని తెలిపారు. మండల పశువైద్యాధికారి రాకేశ్, గోపతి కమలాకర్, సహాయక సిబ్బంది రాజేశం, రవీందర్ బాబు, రాజు, ఉదయ్, పాడి రైతులు పాల్గొన్నారు.


