● అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి ● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల: తుపాన్ నేపథ్యంలో జిల్లాలో రెండురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మోంథా తుపాన్ కారణంగా జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయని, అధికారులు అందుబాటులో ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలెవరూ కల్వర్టులు దాటవద్దని, నీటి వనరుల సమీపంలో ప్రయాణాలు చేయవద్దని పేర్కొన్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇంటి నుంచి వెళ్లవద్దన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.
రైతుల కోసం
18004258187 టోల్‌ఫ్రీ నంబరు
ధాన్యం కొనుగోళ్ల సమస్యల పరిష్కారానికి కాల్‌సెంటర్ ఏర్పాటు చేశామని, రైతులు 18004258187 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్‌లో కాల్‌సెంటర్ ప్రా రంభించారు. సెంటర్ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని, ధాన్యం కొనుగోళ్లలో ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ లత, డీఆర్డీవో రఘువరణ్, డీఎస్‌వో జితేందర్‌రెడ్డి, డీఎం జితేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన
నూతన ఎంపీడీవోలు
జగిత్యాలరూరల్: జిల్లాకు కొత్తగా కేటాయించిన ఎంపీడీవోలు బుధవారం కలెక్టర్ సత్యప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందించారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు చేరవేస్తూ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డిప్యూటీ సీఈవో నరేశ్, డీపీవో మదన్‌మోహన్ పాల్గొన్నారు.


