నిండా ముంచిన ‘మోంథా’
జగిత్యాలఅగ్రికల్చర్/జగిత్యాలరూరల్/పెగడపల్లి/సారంగాపూర్/మల్లాపూర్/రాయికల్/కథలాపూర్/ఇబ్రహీంపట్నం: అన్నదాతలను మోంథా తుపా న్ అతలాకుతలం చేసింది. బుధవారం ఉదయం చిరుజల్లులు కురిసి.. సాయంత్రం ఉన్నట్టుండి పెను బీభత్సంగా మారింది. వర్షంధాటికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, మొక్కజొన్నలు తడిసిపోయాయి. పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు నానా తిప్పలుపడ్డారు. జగిత్యాల రూరల్, అర్బన్ మండలాల్లో పొలాలు నేలకొరిగాయి. పెగడపల్లిలోని పలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు అందుబాటులో లేక రైతులు అద్దెకు తెచ్చుకోవాల్సి వచ్చింది. సారంగాపూర్ మండలంలోని కొనుగోలు కేంద్రాల్లోకి వరదనీరు భారీగా చేరి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. మల్లాపూర్ మండలకేంద్రంతో అన్ని గ్రామాలలో వరి, మొక్కజొన్న, చెరుకు, పసుపు పంటలు నేలవారాయి. అకాలవర్షంతో రాయికల్ మండలం కిష్టంపేట కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. అల్లీపూర్ కేంద్రంలో వరదనీరు భారీగా నిలిచిపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. కథలాపూర్ మండలంలో చేతికొచ్చిన పంట పొలాల్లో నీరు చేరింది. కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ఇబ్రహీంపట్నంలో కొనుగోలు కేంద్రాల వద్ద మొక్కజొన్న రైతులు నానా ఇబ్బంది పడ్డారు.
ఇబ్రహీంపట్నం: మక్కలపై పరదాలు కప్పుతున్న రైతు
రాయికల్: అల్లీపూర్‌లో ధాన్యం కుప్పల మధ్య నీరు
నిండా ముంచిన ‘మోంథా’
నిండా ముంచిన ‘మోంథా’
నిండా ముంచిన ‘మోంథా’
నిండా ముంచిన ‘మోంథా’
నిండా ముంచిన ‘మోంథా’
నిండా ముంచిన ‘మోంథా’


