ఎస్సారెస్పీ 16 గేట్లు ఓపెన్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీ 16 గేట్లు ఓపెన్‌

Oct 30 2025 9:06 AM | Updated on Oct 30 2025 9:06 AM

ఎస్సా

ఎస్సారెస్పీ 16 గేట్లు ఓపెన్‌

జగిత్యాలఅగ్రికల్చర్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో 16 గేట్లను ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 59,654 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎస్కేప్‌ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు, సరస్వతి కెనాల్‌కు 650, లక్ష్మి కెనాల్‌కు 200, మిషన్‌ భరీరథకు 231 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు.

పసుపు పంట పరిశీలన

జగిత్యాలఅగ్రికల్చర్‌: జగిత్యాలరూరల్‌ మండలం పొలాస వ్యవసాయ శాస్త్రవేత్తలు బుధవారం రాయికల్‌ మండలం అల్లీపూర్‌, సింగరావుపేట గ్రామాల్లో పర్యటించారు. పరిశోధన స్థానం నుంచి నల్లారి లక్ష్మీజగదీశ్వర్‌ రైతుకు జేజీఎల్‌–24423 విత్తనం ఇవ్వగా.. ఆ పొలంలో రైతు దినోత్సవం నిర్వహించారు. చిన్నారెడ్డి సాగు చేస్తున్న పసుపు తోటను సందర్శించి, పలు సూచనలు చేశారు. జేజీఎల్‌–24423 విత్తనాన్ని ఇతర రైతులకు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు స్పందన, స్వాతి, ఏఈవో సతీశ్‌, రైతులు పాల్గొన్నారు.

డీపీవోగా రేవంత్‌

జగిత్యాలరూరల్‌: జిల్లా పంచాయతీ అధికారిగా వై.రేవంత్‌ను నియమిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల గ్రూప్‌–1 లో రేవంత్‌ డీపీవోగా ఎంపికయ్యారు. బుధవారం సాయంత్రం కలెక్టర్‌ సత్యప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలు స్వీకరించారు.

బాబ్లీ ప్రాజెక్టు గేట్ల మూసివేత వాయిదా

జగిత్యాలఅగ్రికల్చర్‌: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను మూసివేసేందుకు అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ అధికారులు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఏటా జూలై ఒకటిన ఎత్తి.. అక్టోబర్‌ 28 వరకు తెరిచి ఉంచుతారు. ఈ మేరకు కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో మహారాష్ట్ర, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు బుధవారం గేట్లను మూసివేసేందుకు నిర్ణయించారు. కేంద్ర జల సంఘం ప్రతినిధులు ఎంఎల్‌.ప్రాంక్లిన్‌, ఎ.సతీశ్‌, ఎస్సారెస్పీ అధికారులు వి.జగదీష్‌, కొత్త రవి, బాబ్లీ ప్రాజెక్టు ప్రతినిధి సిఆర్‌.బన్సద్‌ తదితరులు అక్కడకు చేరుకున్నారు. అయితే

బాబ్లీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఉండడంతో గేట్లను తెరిచే ఉంచారు. ప్రవాహం తగ్గిన తర్వాత గేట్లను మూసివేసేందుకు రెండు రాష్ట్రాల అధికారులు నిర్ణయించి అక్కడి నుంచి వెనుదిరిగినట్లు సమాచారం.

బకాయిలు విడుదల చేయాలి

జగిత్యాల: బకాయిల భారం నుంచి విద్యార్థులను ఆదుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం భిక్షాటన చేశారు. నాలుగేళ్లుగా విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు అందక ఇబ్బంది పడుతున్నారని, పేద విద్యార్థులను కళాశాల యాజమాన్యాలు ఇబ్బందికి గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. చదువు పూర్తయి సర్టిఫికెట్ల కోసం కళాశాలకు వెళ్తే ఫీజు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయని, ప్రభుత్వం ఫీజులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా కార్యదర్శి అక్రమాలిక్‌, పట్టణ, రూరల్‌ అధ్యక్ష, కార్యదర్శులు గణేశ్‌, రేవంత్‌, షాకీబ్‌, సోహెల్‌, చరణ్‌, మణిదీప్‌, ముజీబ్‌ పాల్గొన్నారు.

ఎస్సారెస్పీ 16 గేట్లు ఓపెన్‌1
1/4

ఎస్సారెస్పీ 16 గేట్లు ఓపెన్‌

ఎస్సారెస్పీ 16 గేట్లు ఓపెన్‌2
2/4

ఎస్సారెస్పీ 16 గేట్లు ఓపెన్‌

ఎస్సారెస్పీ 16 గేట్లు ఓపెన్‌3
3/4

ఎస్సారెస్పీ 16 గేట్లు ఓపెన్‌

ఎస్సారెస్పీ 16 గేట్లు ఓపెన్‌4
4/4

ఎస్సారెస్పీ 16 గేట్లు ఓపెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement