
ఎన్నాళ్లీ అణచివేత
జర్నలిస్టుల స్వేచ్ఛపై ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ప్రజా సమస్యలపై గళమెత్తిన ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటుగా విలేకరులపై కూటమి సర్కారు అక్రమ కేసులు బనాయిస్తూనే ఉంది. సాక్షి కార్యాలయాల్లో పోలీసులు హల్‌చల్ చేయడంపై రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలు ధ్వజమెత్తుతున్నారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
సాక్షి పత్రిక ఎడిటర్‌పై వరుస కేసులు పెడుతూ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. కక్ష పూరితంగా వ్యవహరిస్తూ పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
– పన్నాల తిరుపతిరెడ్డి,
రైతు ఐక్యవేదిక నాయకుడు
పత్రికాస్వేచ్ఛను హరించడమే
జగిత్యాలటౌన్: సాక్షి ఎడిటర్‌పై వరుసగా కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడటం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. సాక్షి పత్రిక గొంతునొక్కే యత్నాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విరమించుకోవాలి. లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.
– ముంజాల రఘువీర్‌గౌడ్,
కాంగ్రెస్ నాయకుడు

ఎన్నాళ్లీ అణచివేత

ఎన్నాళ్లీ అణచివేత