
జగిత్యాల, మోతె మైత్రికి చిహ్నం జంబిగద్దె
● విజయనగరం తర్వాత జగిత్యాలలోనే గద్దె ● నేడు దసరా... ఏర్పాట్లు పూర్తి
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని జంబిగద్దెకు ప్రత్యేక స్థానం ఉంది. జగిత్యాల, మోతె ప్రజలు ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో పట్టణంలోని అశోక్‌నగర్ ప్రాంతంలో ప్రత్యేకంగా జంబిగద్దెను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో అప్పటి రాజులు అక్కడ జంబిగద్దెను నిర్మించినట్టుగానే ఇక్కడ కూడా అలాగే నిర్మించారు. ఏటా విజయదశమి రోజున జంబిగద్దె వద్ద జంబిచెట్టును ఏర్పాటు చేసి పూజ చేస్తారు. అనంతరం ప్రజలందరూ జంబి పెట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జంబిగద్దె వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. కలర్లు వేయించారు. రంగురంగుల విద్యుద్దీపాలు అమర్చినట్లు కమిషనర్ స్పందన తెలిపారు.
జిల్లాకేంద్రానికే ప్రత్యేకత
మోతె, జగిత్యాల ప్రజలు ఎళ్లప్పుడు స్నేహపూర్వకంగా ఉండాలని జంబిగద్దెను నిర్మించారని పూర్వీకుల నుంచి వస్తున్న మాట. విజయనగరంలోనూ ఇలాగే ఉంది. ప్రతి విజయదశమి రోజున ఇక్కడ శమీ పూజలు నిర్వహిస్తారు.
– కౌశిఖ వేణుగోపాలాచార్యులు, వేదపండితులు
రాజరాజేశ్వరిగా అమ్మవారు
ధర్మపురి: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు బుధవారం రాజరాజేశ్వరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. చండీహోమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొన్నారు. ఆలయ ఈవో శ్రీని వాస్, చైర్మన్ జక్కు రవీందర్ తదితరులున్నారు.

జగిత్యాల, మోతె మైత్రికి చిహ్నం జంబిగద్దె