
మహాలక్ష్మీ పథకం ద్వారా..
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మహిళలను కోటీశ్వరులను చేస్తాం సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నాం భూభారతితో సమస్యలు పరిష్కారం రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్
జగిత్యాల: ప్రజాపాలనలో పేదలకు భరోసా లభి స్తోందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నా రు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమ ని, సన్నవడ్లకు బోనస్, విద్యార్థులకు మెరుగైన వి ద్య అందిస్తున్నామని తెలిపారు. భూభారతి చట్టం ద్వారా రైతులకు వెసులుబాటు కలుగుతుందన్నా రు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లో మాట్లాడారు. 1948లో తెలంగాణ నిజాంచెర నుంచి విముక్తి పొంది దేశంలో విలీనమైన రోజు సెప్టెంబర్ 17 అన్నారు.
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
ఇంటి స్థలం ఉండి.. దరఖాస్తు చేసుకున్న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న 10,775 మందికి ఇళ్లు ఇవ్వగా 7,245 ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని, లబ్ధిదారులకు దశలవారీగా రూ.29.19 కోట్లు చెల్లించామని వివరించారు. భూభారతి ద్వారా రెవెన్యూ సదస్సులు నిర్వహించి 25,672 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించామని, సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయన్నారు. 2024–25 యాసంగి సీజన్‌లో 428 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 4,63,308 టన్నుల దొడ్డురకాన్ని 86,979 మంది రైతుల నుంచి కొని రూ.1,075 కోట్లు ఖాతాల్లో జమ చేశామన్నారు. 30,626 టన్నుల సన్నరకం ధాన్యాన్ని 940 మంది రైతుల నుంచి కొని రూ.11కోట్లతోపాటు, క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 38,619 మందికి రేషన్‌కార్డులు మంజూరు చేశామని, 75,052 మంది కుటుంబ సభ్యుల పేర్లు కొత్తగా చేర్చామని వివరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024 నుంచి విద్యార్థులకు 200 శాతం డైట్ చార్జీలు 40 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచామన్నారు. 1,67,154 జాబ్‌కార్డులు జారీ చేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 11.12 లక్షల పనిదినాలు కల్పించి 32.19 లక్షల ఉపాధి కూలీలకు పనులు కల్పించామన్నారు.
మహిళలకు రుణాలు
మహిళలందరినీ కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇందిరా మహిళాశక్తి ద్వారా 461 వ్యక్తిగత యూ నిట్లకు రూ.10.21కోట్లు మంజూరు చేశామన్నారు. 53 గ్రూపులకు రూ.9.14 కోట్లు కేటాయించామన్నా రు. 330 స్వశక్తి సంఘాలకు ఈ ఏడాది రూ.45.54 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరు చేశామన్నారు. ముందుగా ఆయన పోలీసుల గౌరవ వంద నం స్వీకరించారు. ఆయనకు కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ స్వాగతం పలికారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీమంత్రి జీవన్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు బీఎస్.లత, రాజాగౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సరస్వతిదేవిని దర్శించుకున్న నిరంజన్
అనంతరం నిరంజన్ నూకపల్లిలోని సరస్వతి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కలెక్టరేటోవిశ్వకర్మ జయంతి
జగిత్యాలటౌన్: శిల్ప కల,వాస్తు శిల్పి మూలపురుషుడు విశ్వకర్మ అని నిరంజన్ అన్నారు. కలెక్టరేట్లో విశ్వకర్మ జయంతి వేడుకలో పాల్గొన్నారు. ఆధునిక సమాజంలో ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు విశ్వకర్మను ఆదర్శంగా తీసుకో వాలన్నారు. అదనపు కలెక్టర్ రాజా గౌడ్, బీసీ సంక్షేమ అధికారి సునీత, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాగేందర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రైతులకు భరోసా
వానాకాలం సీజన్‌లో రైతులకు రైతుభరోసా అందించామని, 2,25,406 మంది రైతులకు రూ.243.32 కోట్లు జమచేశామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. నాలుగు విడతల్లో 80,515 మంది రైతులకు రూ.721.74 కోట్ల మాఫీ చేశామన్నారు. రైతుబీమా ద్వారా రూ.248.80 కోట్లు అందించి ఆర్థిక చేయూత కల్పించామని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 19,661 మందికి రూ.46.21 కోట్ల విలువ చేసే శస్త్రచికిత్స చేయించామన్నారు.
మహాలక్ష్మీ పథకాన్ని ఇప్పటి వరకు 5.41 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నారని, వారికి రూ.279.93 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. రూ.500కే సిలిండర్ సరఫరా చేస్తున్నామని, రూ.23.73 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించిందన్నారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకున్నవారికి జీరో బిల్లు ఇస్తున్నామని, 2,07,474 సర్వీసులకు రూ.125.62కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు.

మహాలక్ష్మీ పథకం ద్వారా..