
ప్రజాపోరుతోనే తెలంగాణకు విముక్తి
జగిత్యాలటౌన్: సబ్బండ వర్గాల పోరాటంతోనే నిజాం నిరంకుశత్వం నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు లెల్లెల బాలకృష్ణ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శ్రీవీర తెలంగాణ విప్లవ పోరాటం – నేటి వక్రీకరణలుశ్రీ అంశంపై సదస్సు నిర్వహించారు. రైతాంగ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది కమ్యునిస్టులు, వేలాది మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఆ పోరాటంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ స్థానం ఏమిటని ప్రశ్నించారు. ఏ మాత్రం సంబంధం లేని పార్టీలు విమోచన, విలీనం, విద్రోహం అంటూ చరిత్రకు వక్రభాష్యాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోమటి చంద్రశేఖర్, ఎంఏ.చౌదరి, మల్యాల సురేష్, లకావత్ మహిపాల్, సుజాత తదితరులు పాల్గొన్నారు.