
హైదరాబాద్ రాష్ట్రం విలీనంలో నెహ్రూ, పటేల్ పాత్ర
● మాజీమంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాలటౌన్: హైదరాబాద్ రాష్ట్రం దేశంలో విలీనం కావడం వెనుక నెహ్రూ, సర్దార్ వల్ల భాయ్ పటేల్ పాత్ర పోషించారని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఇందిరాభవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. భారత సైన్యాన్ని హైదరాబాద్ కు తరలించి రాచరిక పాలన నుంచి విముక్తి కల్పించారని పేర్కొన్నా రు. సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడం మంచి నిర్ణయమన్నారు. నాయకులు బండ శంకర్, గాజుల రాజేందర్, రాంచంద్రారెడ్డి పాల్గొనారు.
సీపీఐ ఆధ్వర్యంలో..
జగిత్యాలటౌన్: సీపీఐ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విజయాలు నేటి పరిస్థితిపై సదస్సు నిర్వహించారు. సాయుధ పోరాట అమరులకు నివాళి అర్పించారు. ఎర్రజెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. తుల రాజేందర్, వెంకటస్వామి, భూమేశ్వర్, సుతారి రాములు, మునుగూరి హన్మంతు, కొక్కుల శాంత, లక్ష్మి పాల్గొన్నారు.