బహిరంగ ప్రదేశాల్లో బయోవ్యర్థాలు
● నిబంధనలు పాటించని నిర్వాహకులు
● ప్రజల ప్రాణాలతో చెలగాటం
● పట్టించుకోని అధికారులు ● ఆస్పత్రులు, ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌ల్లో వినియోగించిన సిరంజీలు, సూదులు, మాస్క్‌లు, చేతి గ్లౌజులు, సైలెన్ బాటిళ్లు, గాయాలకు డ్రెస్సింగ్ చేసిన దూది, తొలగించిన అవయవాలు తదితర వాటిని బయో వ్యర్థాలుగా పరిగణిస్తారు.
● వీటిని బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా ఉండడానికి కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయో వేస్ట్ మేనేజ్‌మెంట్ సంస్థలకు అప్పగించాల్సి ఉంటుంది.
● ఇందుకు ఆ సంస్థకు ఆస్పత్రుల స్థాయిని బట్టి ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
● ఫీజు చెల్లించే ఆసుపత్రుల నుంచి సదరు సంస్థ వాహనాల ద్వారా వ్యర్థాలను సేకరిస్తుంది. అ తర్వాత వాటిని కాల్చి భూమిలో పాతి పెడుతుంది. ఈ ప్రక్రియ వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశముండదు.
● పట్టణంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు చాలా వరకు వ్యర్థాలను బయో వేస్ట్ మేనేజ్‌మెంట్ సంస్థకే అందిస్తుండగా.. ఫస్డ్ ఎయిడ్ క్లినిక్‌లు నిర్వహిస్తున్న ఆర్‌ఎంపీలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
● వ్యర్థాలను మున్సిపల్ ఆటోల్లో గానీ, బహిరంగ ప్రదేశాల్లో గానీ పడేస్తున్నారు.
● ఆటోల్లో వేసే వ్యర్థాలు శివారులో ఉన్న డంపింగ్ యార్డుకు చేరుతాయి.
● బహిరంగ ప్రదేశాల్లో ఈ వ్యర్థాలను వేయడం ద్వారా పలు రకాల వైరస్‌లు వ్యాప్తి చెంది ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశముంటుంది.
● దీనిని దృష్టిలో పెట్టుకుని వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
● అయితే ఈ రెండు శాఖల అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో బయో వ్యర్థాలను విచ్చలవిడిగా పడేస్తున్నారు.
● ఆయా శాఖల అధికారులు స్పందించి బయో వ్యర్థాలపై నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మెట్‌పల్లి: పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు, ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌ల నుంచి వెలువడే బయో వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. నిబంధనల ప్రకారం వీటిని ప్రభుత్వం గుర్తించిన బయో వేస్ట్ మేనేజ్‌మెంట్ సంస్థలకు అప్పగించాల్సి ఉంటుంది. కానీ చాలామంది నిర్మానుష్య ప్రదేశాల్లో పడేసి చేతులు దులుపుకుంటున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఇవి నిబంధనలు..
జరుగుతోందిలా..
పొంచి ఉన్న ముప్పు..