
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాలరూరల్: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో ఐఎంఏ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అవోగావోచలో కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. దోమల ద్వారా వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ఇందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు తయారవుతాయన్నారు. ఇంటి పరిసరాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురికి ప్రాంతాల్లో ఆడ ఏడిస్ దోమ కుడితే డెంగీ ప్రబలే అవకాశం ఉందన్నారు. ఐఎంఏ జిల్లా కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. విషజ్వరాలు రాకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఐఎంఏ కోశాధికారి కోటగిరి సుధీర్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, సౌజన్య, మెడికల్ సూపర్‌వైజర్ శోభారాణి, నవ్య, హెచ్‌ఈఓ శ్రీధర్, నాయకులు రవీందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.