
అర్హులకు డబుల్ ఇళ్లు ఇవ్వండి
జగిత్యాలటౌన్: అర్హులందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కోరారు. ఇందిరాభవన్‌కు వచ్చిన మంత్రికి వినతిపత్రం సమర్పించారు. నూకపల్లిలో ఎవరికీ కేటాయించకుండా మిగిలిపోయిన డబుల్‌ఇళ్లతోపాటు ఖాళీగా ఉన్న వెయ్యికి పైగా ఇళ్లను అందించాలని కోరారు. ఈ విషయమై ఆగస్టు 4న ప్రజావాణిలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. నాయకులు బండ శంకర్, గాజుల రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, లైశెట్టి విజయ్ తదితరులు ఉన్నారు.
రాయితీలు ఇస్తేనే మార్పు
సారంగాపూర్: సేంద్రియ వ్యవసాయం సాగును పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు భారీ రాయితీ ఇవ్వాలని జీవన్‌రెడ్డి తెలిపారు. సారంగాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. వారం రోజుల్లో సరిపడా యూరియా నిల్వలు చేరుకుంటాయన్నారు. నానో యూరియాతో వరికి తక్కువ పోషకాలు అందుతాయన్న ఆలోచనలో రైతులు ఉన్నారని, దీనికి తాను కూడా రైతులతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి సారించడానికి రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, గంగారాం, లక్ష్మారెడ్డి, హరీశ్, శేఖర్, పుష్పనాథ్ రైతులు ఉన్నారు.