జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో గేట్లను ఆదివారం మూసివేశారు. ప్రాజెక్టులోకి 40,452 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 26,123 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరదకాలువకు 18వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 5,333, ఏస్కేప్ గేట్ల ద్వారా 1,875, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు.
మూసివేసిన ఎస్సారెస్పీ గేట్లు