
హైకోర్టుకు మెటా నిందితులు
విజయవాడలో ఉండి ముందస్తు బెయిల్ పిటిషన్
కౌంటర్ దాఖలు చేసిన కరీంనగర్ పోలీసులు
పోలీసుల అలసత్వంతోనే నిందితులు పరారయ్యారంటున్న బాధితులు
రెండుసార్లు పిటిషన్, ఒకసారి కేసు నమోదైనా ఉదాసీనత
అందుకే, నిందితులు పొరుగురాష్ట్రానికి వెళ్లారని విమర్శలు
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
మెటా ఫండ్ క్రిప్టో కరెన్సీ పేరిట ఉమ్మడి జిల్లాలో రూ.కోట్లు వసూలు చేసిన నిందితుల విషయంలో కరీంనగర్ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అధిక లాభాలు ఆశ చూపించి రూ. లక్షలు పెట్టుబడుల కింద తీసుకుని, బోర్డు తిప్పేసి న కంపెనీ విషయంలో పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారని బాధితులు మండిపడుతున్నా రు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్‌కు హైకోర్టును ఆశ్రయించడమే ఇందుకు ఉదాహరణ అని ఆరోపిస్తున్నారు. అధిక లాభాల పేరిట పలువురు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారుల నుంచి ఒక్క కరీంనగర్ జిల్లాలోనే రూ. 30 కోట్లు, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలు రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్ల వరకు వసూలు చేసి న మెటా ఫండ్ ప్రతినిధుల్లో ఒక్కరినీ అరెస్టు చేయకపోవడం, నిందితులు యధేచ్ఛగా తిరుగుతుండటంపై బాధితులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు.
రెండుసార్లు పిటిషన్, ఒకకేసు
మెటా కుంభకోణం కొత్తదేం కాదు. మే, జూన్‌లో క రీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రూరల్, టూ టౌన్, కొత్తపల్లి పీఎస్ పరిధిల్లో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఆయా ఠాణా ల్లో ఎస్‌హెచ్‌వోలు ఈ కేసు గ్రావిటీ తెలిసినప్పటికీ నిందితులతో చేతులు కలిపారని బాధితులు ఆరోపిస్తున్నారు. రూ.కోట్లు మోసం చేసిన వారికి అనుకూలంగా వ్యవహరించి, పిటిషన్ వెనక్కు తీసుకునేలా చేయడంలో పోలీసులు సఫలీకృతమయ్యారని అంటున్నారు. జూలైలో ఇదే మెటా ఫండ్ కేసులో దాస రి రమేశ్, దాసరి రాజుపై పిటిషన్లు ఇచ్చినా.. ఈ రూ.కోట్ల కుంభకోణం గురించి వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నా.. నిందితులపై కేసుగా నమోదు చేయడంలో పోలీసులు తాత్సారం ప్రదర్శించారు. పిటిషనర్లు కూడా కేసు పెట్టేందుకు వెనకాడారు. తిరిగి అదే వ్యక్తులపై మూడోసారి పిటిషన్ రావడం, ఈసారి పిటిషనర్ బలంగా నిలబడటంతో విధిలే క కేసు నమోదు చేసి, దర్యాప్తుకు మీన మేషాలు లెక్కించారు. బాధితులు ఉన్నతాధికారులను కలి సేందుకు సిద్ధపడ్డారు. కేసు దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు కేసును సీసీఎస్‌కు అప్పగించారు. ఈ విషయం లీకవడంతో నిందితులు విజయవా డకు పరారై అక్కడ నుంచి ముందస్తు బెయిల్‌కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనికి కరీంనగర్ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.
ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన లోకేశ్, కరీంనగర్‌కు చెందిన దాసరి రమేశ్, రాజు, ప్రకాశ్, సతీశ్ మాస్టర్‌మైండ్స్‌గా ఉన్నారు. వీరు కులాన్ని, లాభా లను ఎరగా వేసి రోజుకు రూ.6లక్షల చొప్పున ఆదాయాన్ని పొందవచ్చని పెట్టుబడులు పెట్టించారు. వసూలు చేసిన మొత్తంతో ఇప్పటికే లోకేశ్ థాయ్‌లాండ్కు, రమేశ్, రాజు విజయవాడకు పారిపోయారు. ఇక మిగిలింది సతీశ్, ప్రకాశ్‌లే. వీరిలో సతీశ్ దర్జాగా అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుండటం విశేషం. పెట్టుబడి పెట్టిన వారిలో అధికశాతం రెవెన్యూ, పోలీసు, ప్రభుత్వ టీచర్లు, రియల్టర్లు ఉన్నారు. ఇదే నింది తులకు అనుకూలంగా మారుతోంది. ఈ ప్రభుత్వ ఉద్యోగులను మెటా ప్రతినిధులు ప్రభుత్వ అనుమతి లేకుండా సింగపూర్, బ్యాంకాక్, మలేషియా దేశాలకు మసాజ్‌ల కోసం విహారయాత్రలకు తీసుకువెళ్లారు. ఇప్పుడు కేసులు పెడితే.. ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయో.. అ న్న భయంతో కేసులకు వెనకాడుతున్నారు. అందులోనూ వీరి పెట్టుబడి పెట్టిన డబ్బంతా అక్రమార్జన, నల్లడబ్బు కావడంతో తేలుకుట్టిన దొంగల్లా.. తెరవెనక నుంచి సెటిల్‌మెంట్ కోసం యత్నిస్తున్నారు.
ఐదుగురిలో ముగ్గురు పరారీ..

హైకోర్టుకు మెటా నిందితులు