
తల్లిపాల ప్రాముఖ్యత వివరించాలి
మల్లాపూర్: తల్లిపాలు బిడ్డకు సురక్షితమని, వాటి ప్రాముఖ్యతను వివరించాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన సందర్శించారు. ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమని, ఈ విషయాన్ని బాలింతలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. అలాగే డెంగీ, టైపాయిడ్, మలేరియా వంటి విషజ్వరాలు ప్రబలకుండా చూడాలని సూచించారు.
నిలిచిన ఇళ్లకు నిధులివ్వండి
జగిత్యాలటౌన్: నూకపల్లి అర్బన్ కాలనీలో వివిధ దశల్లో నిలిచిపోయిన 1611 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.52కోట్లు మంజూరు చేయాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి సీఎంను కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆయనకు వినతిపత్రం సమర్పించారు. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నూకపల్లిలో ఇందిరమ్మకాలనీ పేరిట 4వేలమందికి ఇళ్లు మంజూరు చేసిందని, 80గజాల స్థలంలో పట్టాలు పంపిణీ చేసిందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండువేల ఇళ్లను కూల్చివేయించిందని, మిగిలిన 1611 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని, వాటి నిర్మాణానికి రూ.52కోట్లు అవసరమని వివరించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలు వేయాలి
జగిత్యాల: పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయించాలని అదనపు కలెక్టర్ లత అన్నా రు. మంగళవారం వైద్యాధికారులతో సమీక్షించారు. జిల్లాలో పిల్లలు 2,22,950 మంది ఉ న్నారని, వారి కోసం 2,175 కేంద్రాలు ఏర్పా టు చేశామని, అన్ని అంగన్‌వాడీకేంద్రాలు, ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మాత్రలు వేయాలని సూచించారు. ఆగస్టు 11న వేసే ఈ మాత్రలను తప్పనిసరిగా తీసుకోవాలని, తిరి గి 18న మరోసారి మాత్రలు పంపిణీ చేస్తామ ని వివరించారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి, అర్చన, నరేశ్, నారా యణ, సుమన్, చైతన్యసుధ పాల్గొన్నారు.
జిల్లాకు మోస్తరు వర్ష సూచన
జగిత్యాలఅగ్రికల్చర్: రానున్న ఐదురోజుల్లో జిల్లాకు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీ లక్ష్మి తెలిపారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్‌గా.. రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
బస్సులను జాగ్రత్తగా నడపాలి
జగిత్యాలటౌన్: ఆర్టీసీ బస్ డ్రైవర్లు జాగ్రత్తగా నడపాలని, తమ కుటుంబాలతోపాటు ప్రయాణికులను దృష్టిలో ఉంచుకోవాలని జగిత్యాల ట్రాఫిక్ ఎస్సై మల్లేశం సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జగిత్యాల డిపోలో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. రివర్స్ తీసుకునే సమయంలో కండక్టర్ సూచనలు పాటించాలన్నారు. బ్లాక్ స్పాట్స్‌పై అవగాహన కల్పించారు. డీఎం కల్పన మాట్లాడుతూ సంస్థ నమ్మకాన్ని మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలన్నారు. డిపో ఏఈఎం కవిత, సేఫ్టీ వార్డెన్ ఎస్‌జె.రెడ్డి పాల్గొన్నారు.

తల్లిపాల ప్రాముఖ్యత వివరించాలి

తల్లిపాల ప్రాముఖ్యత వివరించాలి

తల్లిపాల ప్రాముఖ్యత వివరించాలి