
పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి
మల్లాపూర్: సీజనల్ వ్యాధులపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. మందులు ఉన్నాయా..? లేదా..? తెలుసుకున్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరికీ తప్పనిసరిగా పరీక్షలు చేయాలని, రోగి లక్షణాలు రికార్డు చేయాలని సూచించారు. సిబ్బంది సకాలంలో విధులకు హజరుకావాలన్నారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా ప్రోగ్రాం అధికారి రవీందర్, మండల వైద్యాధికారి వాహిని, తహసీల్దార్ రమేశ్‌గౌడ్, ఎంపీడీవో శశికుమార్‌రెడ్డి, సీహెచ్‌వో రామ్మోహన్ పాల్గొన్నారు.
ఫిర్యాదులపై సత్వరమే పరిష్కరించాలి
భూసమస్యలు, ఇతరత్రా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఈనెల 14లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ సత్యప్రసాద్