విజిలెన్స్‌ విచారణ షురూ.. | - | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌ విచారణ షురూ..

Aug 5 2025 6:41 AM | Updated on Aug 5 2025 6:41 AM

విజిల

విజిలెన్స్‌ విచారణ షురూ..

జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో విజిలెన్స్‌ విచారణ షురూ అయ్యింది. సుమారు 18 మందితో కూడిన విజిలెన్స్‌ బృందం సోమవారం ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ప్రతీ విభాగంలో.. ప్రతి రికార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి రికార్డును రాసుకున్నారు. కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో బిల్డింగ్‌ పర్మిషన్లు, నిర్మాణాలు, ఇతరత్రా విషయాలపై అత్యధిక ఫిర్యాదులు ఉండటంతో విజిలెన్స్‌ బృందం దాదాపు 18 భవనాలను పరిశీలించారు. అణువణునా కొలిచి రికార్డులు తయారు చేశారు. గతంలో ఎన్ని భవనాలకు అనుమతులు ఇచ్చారు..? ఏ ప్లానింగ్‌లో ఇచ్చారు..? ఎలా కట్టారు..? అని క్షుణ్ణంగా తెలుసుకున్నారు. విజిలెన్స్‌ అధికారులకు 2023లో 20 మందికి పైగా కౌన్సిలర్లు టౌన్‌ప్లానింగ్‌, బిల్డింగ్‌ అనుమతులు, నిర్మాణాలు, శానిటేషన్‌ విభాగంలో వాహనాలకు సంబంధించిన మరమ్మతు, వాహనాల మాయం, డీజిల్‌, ట్రేడ్‌ లైసెన్స్‌లకు సంబంధించి.. అలాగే ఇంజినీరింగ్‌ సెక్షన్‌లో వాటర్‌చార్జీలు, టెండర్లకు సంబంధించి, రెవెన్యూ విభాగంలో ముటేషన్లు, అసెస్మెంట్‌ కాపీలపై అడిగి తెలుసుకున్నారు. వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించుకుని కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు.

ఉదయం పదిన్నరకే..

ఉదయం 10.30 గంటలకు మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్న విజిలెన్స్‌ అధికారుల బృందం ప్రతి విభాగంలో బృందాల చొప్పున తనిఖీ చేపట్టారు. గతంలో అనేకమంది పలు విభాగాలపై ఫిర్యాదులు చేయడంతో మున్సిపల్‌ అధికారులకు మెయిల్‌ ద్వారా వివరాలు ఇవ్వాలని నివేదిక పెట్టా రు. మున్సిపల్‌ అధికారులు జవాబులు ఇచ్చి నప్పటికీ ఆశించిన మేరకు లేకపోవడంతో ఏకంగా విజి లెన్స్‌ అధికారు బృందం తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్‌, శానిటేష న్‌, రెవెన్యూ వి భాగాలపైనే దృష్టి సారించినట్లు తెలిసింది.

అంతా అవినీతిమయం

జగిత్యాల మున్సిపాలిటీ అవినీతికి కేరాఫ్‌గా నిలిచింది. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందంగా ప్రజల సొమ్ము అత్యధికంగా దుర్వినియోగమవుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. టౌన్‌ ప్లానింగ్‌లో ఇంటి అనుమతులలో చేతివాటం, ఆర్‌వో సెక్షన్‌లో ముటేషన్లకు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ప్రతి విభాగంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏకంగా టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఆర్‌వో విభాగంలో అయితే ఓ భూకబ్జా యత్నంలో మున్సిపల్‌ కమిషనర్‌తోపాటు అధికారి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవల మున్సిపల్‌ పాలన గాడితప్పిందని ఓ మాజీ కౌన్సిలర్‌ కలెక్టర్‌ లేఖ రాశారు. బల్దియాలో అవినీతిపరులుగా ఉన్న వారిని సైతం కీలక బాధ్యతలు అప్పగించడంపై పలు ఆరో పణలు వస్తున్నాయని, వెంటనే చర్యలు తీసుకో వాలని కోరారు.

వేటు ఎవరిపైనో..?

అవినీతి ఆరోపణలు అత్యధికంగా వెలువడం.. విజిలెన్స్‌ అధికారులు నిఘా పెట్టడంతో వేటు ఎవరిపై పడుతుందోనని అక్రమాలకు పాల్పడిన ఆఫీసర్లలో వణుకు పుడుతోంది. 2023 నుంచి ఇప్పటి వరకు జరిగిన అవినీతి, అక్రమాలపై దృష్టి సారించడంతో అప్పట్లో పనిచేసిన అధికారులతో పాటు, ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో ప్రజాప్రతిధుల హస్తం ఉండటంతో అధికారులు తలొగ్గి పనులు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ప్రతి విభాగం రికార్డుల పరిశీలన

భవన నిర్మాణాలూ తనిఖీ

ఎవరిపై వేటు పడేనో..?

శాఖల

మార్పుతో సరి..

బల్దియాలో అధికారులపై నేరుగా ఆరోపణలు వస్తున్నా శాఖల మార్పులు చేస్తున్నారే తప్ప చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఇటీవల బిల్‌కలెక్టర్‌ ఏకంగా సుమారు రూ.3 లక్షల వరకు ఆస్తిపన్నును సొంతానికి వాడుకోగా.. ఇటీవలే సస్పెండ్‌ చేశారు. ఇలాంటి సంఘటనలు అనేక ఉన్నాయి. కొన్ని కీలక శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సైతం ఉండటంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

విజిలెన్స్‌ విచారణ షురూ..1
1/1

విజిలెన్స్‌ విచారణ షురూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement