
కళాశాల సమీపంలో హాస్టల్ పెట్టండి
జిల్లాకేంద్రంలోని మిషన్ కాంపౌండ్ వెనక అద్దె భవనంలో మా హాస్టల్ ఉంది. కళాశాలకు హాస్టల్ దూరం ఉండటంతో మధ్యాహ్న భోజనానికి వచ్చి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నాం. హాస్టల్ మిషన్‌కాంపౌండ్‌ను ఆనుకుని ఉండటంతో పోకిరీల బెడద ఎక్కువగా ఉంది. పోకిరీలు హాస్టల్‌ల్లోకి వస్తూ విపరీత చేష్టలకు పాల్పడుతున్నారు. ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా మార్పులేదు. ఇలాంటి చికాకుతో చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతునానం. హాస్టల్ భవనాన్ని కళాశాల సమీపంలోకి మార్చండి.
– ఇంటర్ బీసీ హాస్టల్ విద్యార్థులు