
కోట బురుజు కనుమరుగుకు కుట్ర
కోరుట్లలో 3.21 ఎకరాల విస్తీర్ణంలో వెయ్యేళ్ల చరిత్ర కలిగి.. చాళుక్య రాజుల వైభవానికి సజీ వసాక్షంగా ఉన్న కోట బురుజు, కోనేరు స్థలా లను కొందరు అన్యాక్రాంతం చేసే కుట్ర చేస్తున్నారు. పాత జీవోలను రద్దు చేసి కోటబురుజు పరిధిని 15 మీటర్లకు కుదిస్తున్నారు. అత్యంత విలువైన కోట బురుజు స్థలాలను అక్రమార్కుల కబంధ హస్తాల నుంచి విడిపించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ఆ ప్రదేశంలో ఆహ్లాదకరమైన పార్క్‌తోపాటు కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసి ప్రజావసరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి. – అఖిలపక్ష, ప్రజాసంఘాల
నాయకులు, కోరుట్ల