
ఇంటికి దారి చూపండి
కలెక్టరేట్‌లో ఇలా నేలపై పడుకున్న వ్యక్తి పేరు మర్రిపల్లి రాజగంగారం. లోకోమోటివ్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన ఈయన తను నిర్మించుకున్న ఇంటికి అడ్డుగా ఓ వ్యక్తి గోడ నిర్మించి ఇబ్బంది పెడుతున్నాడని గతంలో అధికారులకు ఫిర్యాదు చేయగా తొలగించారు. మళ్లీ గోడ నిర్మించి ఇబ్బంది పెడుతున్నాడని, తన ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడని ఇలా నిరసన తెలిపాడు. ఎనిమిదేళ్లుగా ఆర్డీవో, తహసీల్దార్, ఎంపీడీవోల చుట్టూ తిరుగుతున్నా తన సమస్యను పట్టించుకోవడం లేదన్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు బాధితుడితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
●