
ఆలకించండి.. పరిష్కరించండి
● జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సత్యప్రసాద్ ● సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు
జగిత్యాలటౌన్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన
ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. వారి నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. 43మంది బాధితులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ లత, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు పులి మధుసూదన్‌గౌడ్, జివాకర్, శ్రీనివాస్, డీఆర్‌డీవో రఘువరణ్, డీపీవో మదన్‌మోహన్ పాల్గొన్నారు.