
అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని1, 2, 5, 7, 48, 47 వార్డుల్లో రోడ్ల నిర్మాణ పనులను జగిత్యాల ఎమ్మె ల్యే సంజయ్‌కుమార్ సోమవారం ప్రారంభించారు. జగిత్యాలకు అత్యధిక నిధులు తెచ్చామని, పట్టణ ప్రణాళిక మాస్టర్‌ప్లాన్‌కు కొందరు కావాలని అడ్డుపడ్డారని, అభివృద్ధికి ఆటంకం కల్పించారని తెలిపా రు. త్వరలోనే అభివృద్ధి పనులు పూర్తి చేయిస్తానన్నారు. మోతె చెరువు పారిశుధ్యానికి ఎఫ్ ఎస్‌టీపీ మంజూరు చేశామన్నారు. కమిషనర్ స్పందన, ఏవో శ్రీనివాస్, డీఈ వరుణ్, ఏఈ చరణ్, మాజీ కౌన్సిలర్ కూసరి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
పద్మశాలీ కార్యవర్గ సభ్యులకు అభినంధన
రాయికల్: పట్టణ పద్మశాలీ సేవ సంఘం కార్యవర్గాన్ని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అభినందించారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, పద్మశాలీ సంఘం పట్టణ అధ్యక్షుడు బోగ రాజేశం, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల నరేశ్, ఉపాధ్యక్షుడు దాసరి గంగాధర్, కోశాధికారి ఆడెపు నర్సయ్య, నాయకులు మోర రాంమూర్తి, చంద్రతేజ, కట్టెకోల భాస్కర్, దాసరి శ్రీనివాస్, తాటిపాముల విశ్వనాథం పాల్గొన్నారు.