
మూడు పంటలకు సాగునీరు
● రామగుండం ఎత్తిపోతల ప్రారంభం ● అంతర్గాంలో గోదాంల నిర్మాణానికి కృషి ● మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
రామగుండం/ధర్మారం: రామగుండం ఎత్తిపోతల ద్వారా ఏటా మూడు పంటలకు సాగునీరు అందుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూర్ శివారులో రూ.75 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతలను మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రా వు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఆదివారం ప్రారంభించా రు. ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి శివారులో రూ.45.15 కోట్లతో చేపట్టిన ఐటీఐ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు, పంపుహౌస్‌లను రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో నిర్మించారని, ఒక్క ఎకరాకూ నీటిని వినియోగించుకోలేదన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రామగుండాన్ని పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అంతర్గాంలో గోదాంల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం సంపూర్ణంగా అమలవుతోందన్నారు. ప్రయాణికుల అవసరం మేరకు మరో 16 బస్సులు కేటాయించాలని మక్కాన్‌సింగ్ కోరగా సానుకూలంగా స్పందించారు. ధర్మారంలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఉత్తమ్ మాట్లాడుతూ.. ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. మంత్రి లక్ష్మణ్‌కుమార్ విన్నపం మేరకు పత్తిపాక శివారులో శ్రీలక్ష్మీనర్సింహస్వామి రిజర్వాయర్ నిర్మిస్తామని, డీపీఆర్ తయారీకి రూ.1.10కోట్లు కేటాయించిందని తెలిపారు.