
స్థానిక ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి
జగిత్యాలరూరల్: స్థానిక ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వంజరిపల్లి, నర్సింగాపూర్, వెల్దుర్తి, గొల్లపల్లి, తిమ్మాపూర్, జాబితాపూర్ గ్రామాల్లో శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, తర్వాత ప్రజలను మోసం చేస్తోందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధి, పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. జగిత్యాల సింగిల్ విండో చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, మాజీ సర్పంచులు రజిత, గంగాధర్, ప్రవీణ్‌గౌడ్, నాయకులు కమలాకర్‌రావు, మల్లేశ్‌గౌడ్, శ్రీనివాస్, గంగారెడ్డి, మహేశ్, రవి, ధర్మయ్య, దశరథం, గంగమల్లు పాల్గొన్నారు.
సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలం
సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని వసంత అన్నారు. నర్సింగాపూర్ శివారులో పొలంలో వరినాట్లు వేస్తున్న మహిళలతో ముచ్చటించారు. వర్షాలులేకపోవడం.. సాగునీరు రాకపోవడంతో నాట్లు ఆలస్యం అవుతున్నాయని మహిళలు చెప్పడంతో ప్రభుత్వం తీరు ఇలా ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలననే బాగుందని మహిళలు కితాబునిచ్చారు.