
ఆపదలో అండగా..
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): యైటింక్లయిన్‌కాలనీ సెక్టార్–3 సింగరేణి స్కూల్‌లో 1993–94లో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అనే మాటకు నిర్వచనంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రదేశాల్లో స్థిరపడ్డారు. వాట్సాప్ గ్రూప్‌గా ఏర్పడి చిన్ననాటి మిత్రుల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా సాయం అందించి ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ స్నేహితుడు యైటింక్లయిన్‌కాలనీకి చెందిన పెండ్యం వీరయ్య కరెంట్ షాక్‌తో రెండు చేతులు కోల్పోగా రూ.4.8 లక్షలు సేకరించి బాధితుడికి అందజేశారు. గోదావరిఖనికి చెందిన బాసాని లక్ష్మయ్య 2018లో అనారోగ్యంతో మృతి చెందగా రూ.1.35 లక్షలు, మరో మిత్రుడు కొండ్ర సురేశ్ 2022లో చనిపోగా రూ.2.55 లక్షలు ఆయా కుటుంబాలకు అందజేశారు. ఇప్పటి వరకు దాదాపు రూ.14 లక్షలు చేయూతనందించారు.