
ఆ రోజు అందరూ ఒకే చోట
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఎక్కడ ఉన్నా ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితులందరూ ఒకే చోట కలుసుకుంటారు. కుల, మత భేదం.. సీనియర్, జూనియర్ తేడా లేదు. కాల్వశ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్‌లో 1976–77 విద్యాసంవత్సరం నుంచి చిగురించిన వారి స్నేహంతో వరుసగా రెండు దశాబ్దాలుగా ఒకే చోట చేరుతారు. యోగక్షేమాలు తెలుసుకుంటారు. వివిధ కారణాలతో మృతిచెందిన గురువులు, స్నేహితులకు రెండు నిమిషాలు మౌనం పాటిస్తారు. అనంతరం అందరూ భోజనం చేస్తారు. తాము చదివిన పాఠశాలలో ప్రతీ విద్యాసంవత్సరం ప్రతిభచాటిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తారు.