
స్నేహం గొప్ప వరం
సాక్షి, పెద్దపల్లి: మంచి స్నేహం భవిష్యత్‌కు మార్గం చూపిస్తుంది. చెడు అలవాట్లు కలిగినివారికి దూరంగా ఉండాలి. సినిమాలు, షికార్లు అంటూ తిరగకుండా చదువును ప్రోత్సహించే వారే నిజమైన స్నేహితులు. అలాంటివారిని నేను సంపాదించుకున్నా. ఉప్పల్‌లోని స్కూల్ ఫ్రెండ్స్‌తో ఇప్పటికీ టచ్‌లో ఉంటా. ఏటా మేమంతా కలిసి చిన్ననాటి చిలిపి చేష్టలను గుర్తుచేసుకొని సరదాగా గడుపుతాం. అందరం కలిసి కష్టాల్లో ఉన్న స్నేహితులకు చేయూతనందిస్తూ, చదువుకున్న పాఠశాల, ఉపాధ్యాయుల కోసం సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం.
– కరుణాకర్, డీసీపీ, పెద్దపల్లి