
బడి దోస్తులు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండల కేంద్రంలోని హైస్కూల్లో 2004–05లో పదో తరగతి చదివిన విద్యార్థులు 2017లో బడి దోస్తులు గ్రూపుగా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీరి స్నేహితుడు ఇల్లంతకుంటకు చెందిన బండారి రమేశ్ ఆకస్మికంగా మరణించగా రూ.13 వేలు, రోడ్డ శ్రీకాంత్ అనారోగ్యానికి గురికాగా రూ.11 వేలు, కాసుపాక తిరుపతి మృతిచెందగా రూ.11 వేలు, వల్లంపట్ల గ్రామంలో ఎర్రవెల్లి శంకర్ చనిపోగా అతడి కుటుంబానికి రూ.15 వేలు ఆర్థికసాయం అందించారు. అలాగే ముస్కాన్‌పేటలో హరికుమార్, మహేశ్ కుటుంబాలకు.. ఇలా చాలా కుటుంబాలకు ఆర్థికసాయం చేశారు. ఆర్థికంగా ఆదుకునేందుకు స్నేహితులంతా ప్రతినెలా కొంత మొత్తం బ్యాంకులో జమ చేస్తుంటారు. ఈ గ్రూపు మాదిరిగానే గాలిపెల్లి, కందికట్కూర్, ఇల్లంతకుంట ఎఫ్‌బీఐ, స్నేహితుల గ్రూపులు కూడా ఉన్నాయి. వీరు కూడా బాధిత కుటుంబాలకు సాయం చేస్తూ, వైద్య శిబిరాలు, విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తుంటారు.