
వాకింగ్ ఫ్రెండ్స్
విద్యానగర్(కరీంనగర్): పదిహేనేళ్ల క్రితం కొత్తపల్లి రతన్, మోటూరి ఆంజనేయులు, తొడుపునూరి శ్రీనివాస్ వాకింగ్ ఫ్రెండ్స్. ఈ ముగ్గురు రోజూ అంబేడ్కర్ స్టేడియంలో వాకింగ్ చేస్తూ ప్రస్తుతం 15 మంది స్నేహితులతో ట్రైగర్స్ వాకింగ్ గ్రూప్ అయ్యారు. వీరిలో కొందరికి కొందరు బంధువులు అయినా స్నేహితులుగానే కలిసి ఉంటారు. ఫంక్షన్లు, ఫిక్‌నిక్, పుణ్యక్షేత్రాలకు కుటుంబాలతో కలిసి వెళ్తారు. వీరిలో రాచమల్ల ప్రసాద్, శ్రీనివాస్, పల్లేర్ల శ్రీనివాస్, చీకటిమల్ల అశోక్‌కుమార్, తొడుపునూరి వేణుగోపాల్, పడకంటి వినోద్ తదితరుల ఆలోచన మేరకు 2023 జనవరి 2న బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ఏర్పాటు చేసి కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాస్పుత్రి, మాతాశిశు కేంద్రంలో చికిత్స కోసం వచ్చినవారికి రోజూ ఉదయం అల్పాహారం, సాయంత్రం భోజనాలు అందిస్తున్నారు. ప్రతీ శనివారం వీక్లీ మార్కెట్‌లో చిరువ్యాపారులు, గ్రామాల నుంచి వచ్చిన రైతులు, అమ్మకందారులకు, నగునూర్ దుర్గాభవానీ ఆలయంలో ప్రతీ మంగళ, శుక్ర, ఆదివారాలతో పాటు ప్రత్యేక రోజుల్లో భక్తులకు దాత సహకారంతో అన్నప్రసాదం అందిస్తున్నారు.
కల్మషం లేని దోస్తీ..
చిన్ననాటి దోస్తుల్లో కల్మషం లేకుండే. కలిసి ఆడిన ఆటలు, కాకి ఎంగిలి చేసి పంచుకున్న పిప్రమేట్లు, జారే నెక్కరు పైకి దోపుకుంటూ గోనె సంచిలో పుస్తకాలు దోపుకుని భుజాల మీద చేతులేసుకుంటూ బడికి పోయిన దోస్తులు ఇప్పుడు కష్టమే. అయినా అక్కడక్కడ ప్రాణమిచ్చే దోస్తులు ఉన్నారు. వారిని జీవితకాలం నిలుపుకోవాలి. – ఎ.కిరణ్‌కుమార్,
న్యాయవాది, రాంనగర్, కరీంనగర్

వాకింగ్ ఫ్రెండ్స్