
పీఎంపీ నిర్లక్ష్యం.. వృద్ధుడికి శాపం
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఓ పీఎంపీ నిర్లక్షం మండల కేంద్రానికి చెందిన వృద్ధుడు గంగారాంకు శాపంగా మారింది. ఆరోగ్యం బాగాలేదని పీఎంపీతో ఇంజక్షన్ వేయించుకుంటే సెప్టిక్ కావడంతో ఆ వృద్ధుడి బాధ వర్ణనాతీతంగా ఉంది. ఇలా ఎందుకు అయ్యిందని సదరు పీఎంపీ దగ్గరికి వెళ్లి పెద్ద హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుమని గంగారాం కోరగా.. నీ ఇష్టమున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశాడు. నెల రోజులుగా ఏం చేయాలో తెలియక పెద్ద ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేక ఇంట్లోనే ఆ బాధను భరిస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని, పీఎంపీపై చర్యలు తీసుకోవాలని వృద్ధుడు గంగారాం వేడుకుంటున్నాడు.
నెల రోజులుగా నరకయాతన
పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలంటే పట్టించుకోని పీఎంపీ
ఏం చేసుకుంటావో చేసుకోమని బెదిరింపులు
ఏం చేయలేని నిస్సాయ స్థితిలో నలిగిపోతున్న వృద్ధుడు