
విద్యార్థులను ప్రోత్సహిస్తూ..
జమ్మికుంట(హుజూరాబాద్): అబాది జమ్మికుంట ప్రభుత్వ పాఠశాలలో చదివిన కాటిపల్లి లింగారెడ్డి (అసిస్టెంట్ ప్రొఫెసర్), మార్క విజయప్రతాప్(ఎన్‌ఆర్‌ఐ), పింగిళి వెంకట్‌రెడ్డి, అయిత శ్రీనివాస్, అమృత సురేశ్(టీచర్లు) ఐదుగురు స్నేహితుల బృందం ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. తాము చదివిన పాఠశాలలో ఏటా 10వ తరగతిలో ప్రతిభచాటిన విద్యార్థులకు (ముగ్గురు) రూ.10వేలు నగదు పురస్కారం అందజేస్తున్నారు. అలాగే ఇతర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బుక్స్, క్యాలెండర్, ఐడెంటిటీ కార్డులు తదితర వస్తువులు అందిస్తూ సేవాభావాన్ని చాటుతున్నారు.