
కోమన్‌పల్లి భూములకు పూర్తిస్థాయి రికార్డులు
సారంగాపూర్: కోమన్‌పల్లి గ్రామ భూములకు ఇప్పటివరకు ఎలాంటి రికార్డులు లేవని, ప్రస్తుతం పూర్తిస్థాయి భూరికార్డులు, నక్షా, సేత్వార్‌ను రూపొందించినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. శుక్రవారం బీర్‌పూర్ మండలం కోమన్‌పల్లి గ్రామంలో భూభారతి కింద పునరావాస గ్రామమైన కోమన్‌పల్లిని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గ్రామంలోని భూములను రీసర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామసభలో కలెక్టర్ మాట్లాడుతూ కోమన్‌పల్లిలో మొత్తం 419 సర్వే నంబర్ల కింద 616 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిని పైలెట్ ప్రాజెక్టు కింద రీసర్వే చేసి పూర్తిస్థాయి రికార్డులు రూపొందించామన్నారు. దీనిపై రైతుల అభిప్రాయాలు, సూచనలు, సలహాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామశివారులోని భూములను, ఎస్సారెస్పీ కాలువల భూములను ఎస్సారెస్పీ ఈఈ చక్రూనాయక్‌తో కలిసి పరిశీలించారు. పంచాయతీ రాజ్ అధికారులతో గ్రామంలోని రోడ్ల భూములపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, జగిత్యాల ఏడీ(సర్వే) వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ సుజాత, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.
కేజీబీవీ సందర్శన
సారంగాపూర్ కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం సందర్శించారు.విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలని సూచించారు. 8వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్‌తో పాటు బయోలజీ సబ్జెక్టులను బోధించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి ఇచ్చిన సమాధానంతో మరింత వివరించారు. పరిసరాలు, వంట గదిలో నిల్వ ఉన్న స్టాక్‌ను పరిశీలించి భోజనం రుచిగా, శుచిగా ఉండాలని సూచించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి బాగుందని అభినందించారు.
● కలెక్టర్ సత్యప్రసాద్