
అంజన్నకు పంచామృతాభిషేకం
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారికి శ్రావణ సప్తాహం ఉత్సవాల్లో భాగంగా బుధవారం పంచామృతాభిషేకం చేశారు. ముందుగా స్వామివారి మూలవిరాట్టును తమలపాకులు, పూలతో అలంకరించారు. సాయంత్రం శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రఘు, ఉప ప్రధాన అర్చకులు మారుతీప్రసాద్, రాంచంద్ర ప్రసాద్, అర్చకులు అఖిల్ కృష్ణ, రాంచందర్ పాల్గొన్నారు.
మహిళాసంఘాలు ఆదాయంపై దృష్టిసారించాలి
కథలాపూర్: మహిళాసంఘాల సభ్యులు ఆదాయంపై దృష్టి సారించాలని జిల్లా అడిషనల్ డీఆర్డీవో సునీత పేర్కొన్నారు. బుధవారం కథలాపూర్‌లో సీ్త్రశక్తి భవన్‌లో వీవోఏలతో సమావేశమయ్యారు. వందశాతం అక్షరాస్యత కార్యక్రమంలో మహిళలు భాగస్వామ్యం కావాలన్నారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా 10 మంది నిరక్షరాస్యులకు ఒక వాలంటీర్‌ను నియమించి వారికి చదువు చెప్పిస్తామన్నారు. మహిళలు రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించేలా అధికారులు ప్రోత్సహించాలన్నారు. డీపీఎంలు విజయభారతి, రమేశ్, ఏపీఎం నరహరి, సీసీలు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
వెల్గటూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధర్మారం, వెల్గటూర్ మండలాలకు చెందిన బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పి ఆహ్వానించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ మద్దుల గోపాల్‌రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
వినియోగదారులకు ఇబ్బంది రానీయొద్దు
మెట్‌పల్లిరూరల్: విద్యుత్ సరఫరాలో వినియోగదారులకు ఇబ్బంది రానీయొద్దని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ సుదర్శనం అన్నారు. మెట్‌పల్లి మండలం మెట్లచిట్టాపూర్ సబ్‌స్టేషన్‌లో రూ.85 లక్షలతో ఏర్పాటు చేసిన అదనపు 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను బుధవారం ప్రారంభించారు. జిల్లాలోని అన్ని సబ్‌స్టేషన్లకు రెండు ప్రత్యామ్నాయ 33 కేవీ అంతర్గత లైన్లు నిర్మిస్తున్నామని, ఇప్పటివరకు 70 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్‌లు బిగించుకుంటే ఓవర్‌లోడ్, లో–ఓల్టెజీ సమస్య రాదని, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోకుండా ఉంటాయని తెలిపారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఈ మధుసూదన్, ఎమ్మార్టీ డీఈ గోపికృష్ణ, టెక్నికల్ డీఈ గంగారాం, ఏడీఈలు మనోహర్, రాజు, ఏఈలు అజయ్, రహీం, కార్యదర్శి దివ్య, నాయకులు శేఖర్‌రెడ్డి, రాజారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

అంజన్నకు పంచామృతాభిషేకం

అంజన్నకు పంచామృతాభిషేకం

అంజన్నకు పంచామృతాభిషేకం