
కాంగ్రెస్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు
రాయికల్/సారంగాపూర్: కాంగ్రెస్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో పూర్తిగా విఫలమైందని, ఈ విషయాన్ని ప్రతి గడపకూ తీసుకెళ్లాలని సూచించారు. బుధవారం సారంగాపూర్ మండలం రేచపల్లిలో రేచపల్లి, మ్యాడారంతండా, లచ్చునాయక్‌తండా, భీంరెడ్డి గూడెంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాయికల్ మండలం అల్లీపూర్‌కు చెందిన పంతెంగి లక్ష్మీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారంతో మంజూరైన సీఎం సహాయ నిధి చెక్‌ను అందించారు. వేర్వేరు చోట్ల మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు. పార్టీ సారంగాపూర్ మండల అధ్యక్షుడు తేలు రాజు, విండో మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, నాయకులు వొడ్నాల జగన్, బుచ్చిమల్లు, మల్ల య్య, రాయికల్‌లో పార్టీ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌రావు, నాయకులు హన్మండ్ల మహేశ్, మోర వెంకటేశ్వర్లు, సాగర్‌రావు, సత్యంరావు, రాజిరెడ్డి, సాయిరెడ్డి, బక్కన్న, నర్సయ్య పాల్గొన్నారు.